నమస్కారం.
తెలుగు వికీపీడియను రహ్మతుల్లా గారి అభ్యర్థనమేరకు [1] సిఐఎస్ ఆక్సెస్ టు నాలడ్జ్ ప్రోగ్రాం
ఇందూ
జ్ఞానవేదిక ప్రచురణలు క్రియేటివ్ కామన్స్ (CC-BY-SA 3.0)లైసెన్స్ లో విడుదల చేయడానికి
వారిని
సంప్రదించింది. ఈ విషయమై ఇందూ జ్ఞానవేదిక ప్రతినిధులతో విస్త్రుతంగా చర్చించడం జరిగింది. ఈ
చర్చల
పర్యవసానంగా వారు 20 ఇందూ జ్ఞానవేదిక ప్రచురణలు క్రియేటివ్ కామన్స్ (CC-BY-SA 3.0)లైసెన్స్
లో
విడుదల చేయడానికి ఒప్పుకున్నారు మరియు వీటిని తెలుగు వికీసోర్సులో ఉంచి జనబాహుళ్యానికి
ఉచితంగా ఈ
జ్ఞానభాండాగారాన్ని అందుబాటులోకి తేవడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. రహ్మతుల్లా గారు ఇచ్చిన ఈ
మంచి
సూచన మరియు వారి స్పూర్థి గణనీయం. వారికి అనేకానేక ధన్యవాదాలు.
భారతదేశంలో అందులోను భారతీయ భాషలలో ఇంత పెద్ద సంఖ్యలో ఆధ్యాత్మిక ప్రచురణలు క్రియేటివ్
కామన్స్
(CC-BY-SA 3.0)లైసెన్స్ లో విడుదల కావడం బహుశా ఇదే మొదటి సారి. హైదరాబాదులో ఒక సమావేశం
ఏర్పాటు
చేసి ఈ ప్రచురణలను క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ లో విడుదల చేయాలని ఆలోచన. ఇలా చేయడం ద్వారా
క్రియేటివ్
కామన్స్ గురించి తెలుగువారిలో ఇంకా అవగాహన పెంచవచ్చు. ఈ కార్యక్రమం తేది, వేదిక ఇంకా ఖరారు
కాలేదు,
బహుశా జూన్ నెల హైదరాబాదులో జరిగే తెవికీ నెలసరి సమావేశంలో భాగంగా దీనిని చేయవచ్చు. ఈ
కార్యక్రమాన్ని
తెవికీ సముదాయం సహకారంతో సి.ఐ.ఎస్ A2K తెలుగు ప్రణాళికలో భాగంగా చేయదలిచాము. మీ సూచనలు
సలహాలు స్పందనలు ఇక్కడ [2] తెలియచేయగలరు.
ఇట్లు,
విష్ణు
[1]
https://meta.wikimedia.org/wiki/Talk:India_Access_To_Knowledge/Requests#Req…
[2]
http://bit.ly/1lC8vvy