ధన్యవాదాలు
On Sunday, 29 December 2013 12:59 PM, Arjuna Rao Chavala <arjunaraoc(a)gmail.com>
wrote:
---------- ఫార్వర్డ్ చేసిన సందేశం ----------
పంపినవారు: తెలుగు వీర <teluguvira(a)gmail.com>
తేది: 29 డిసెంబర్ 2013 11:58 AM
సబ్జెక్టు: [తెలుగువికీ] కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కార
ఫలితాలు
వీరికి: teluguwiki(a)googlegroups.com, telugublog(a)googlegroups.com
తెలుగు నెజ్జనులందరికీ మళ్లీ నమస్కారాలు,
తెలుగు వికీపీడియా పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రారంభించబడిన
కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కారానికి[1] వచ్చిన
ప్రతిపాదనలను[2] ఎంపిక మండలి పరిశీలించడం పూర్తి అయ్యింది. ముందుగా ప్రతిపాదిత
సభ్యులకు, ఆయా ప్రతిపాదనలను ప్రారంభించి, మద్దతు ఇచ్చి, విస్తరించి ఈ
ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొన్న తెలుగు వికీ సభ్యులందరికీ మరియు మీ
తోడ్పాటుకి ధన్యవాదాలు.
ఈ పురస్కారానికి 28 ప్రతిపాదనలు రాగా వాటిలో 18కి ప్రతిపాదిత సభ్యులు అంగీకారం
తెలిపారు.ఈ పురస్కారపు తొలివిడతగా ఈ సంవత్సరం, గత దశాబ్ది కాలంలో చేసిన కృషిని
గుర్తిస్తూ పది పురస్కారాలు ఇవ్వాలని ఎంపిక మండలి నిర్ణయించింది. దీనికి
ఎంపికైన అభ్యర్ధులు, మూల్యాంకన వరుసక్రమంలో *చదువరి,ఎం.ప్రదీప్, చావా కిరణ్,
వీవెన్, పాలగిరి, రవిచంద్ర,అహ్మద్ నిసార్, శశి,జె.వి.ఆర్.కె.ప్రసాద్,మరియు
భాస్కర నాయుడు*. వీరికి దశాబ్ది ఉత్సవాలలో నగదు బహుమతి మరియు పురస్కారము
ఇవ్వబడుతుంది. వీరి చిత్రాలు, పురస్కార ప్రధానాంశాలు తెలుగు మరియు ఆంగ్లములో
[3] చూడవచ్చు. కృషి గణాంకాలు మరియు వికీ అభివృద్ధికి దోహదపడిన గుణాత్మక అంశాల
విశ్లేషణ[4] మరియు మూల్యాంకనం [5] కూడా చూడవచ్చు.
అంగీకారం తెలపని ప్రతిపాదిత సభ్యులు మరియు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి
తోడ్పడిన ఇతర సభ్యుల కృషిని గుర్తిస్తూ ఎంపిక మండలి ప్రశంసాపత్రమివ్వాలని
నిర్ణయించింది. దీనికి ఎంపికైన మొత్తము 30 సభ్యుల వివరాలు[6] చూడవచ్చు. వీరికి
ప్రశంసా పతకం (ఎలెక్ట్రానిక్) త్వరలో వారివాడుకరి చర్చాపేజీలలో ఇవ్వబడుతుంది.
ఈ పురస్కారాలను రూపకల్పన దిశ నుండి దాదాపు వేయి గంటల సమయాన్ని వెచ్చించిన
ఎంపిక సంఘం సభ్యులు, అర్జునరావు,రాజశేఖర్, రాధాకృష్ణ మరియు సుజాతగార్లకు నా
కృతజ్ఞతలు. ఈ పురస్కారాలను రూపకల్పన చేసి, ఎంపిక సంఘం కార్యదర్శిగా
కార్యభారాన్నంతా చాలా మటుకు మోసిన అర్జునరావు గారికి ప్రత్యేకకృతజ్ఞతలు.
పురస్కారాలకై కావలసిన నిధులు సమకూర్చడానికి అంగీకరించిన తెవికీ దశాబ్ది ఉత్సవ
కార్యనిర్వాహక వర్గానికి[7] ధన్యవాదాలు.
వైజాసత్య
కొలరావిపు ఎంపిక మండలి అధ్యక్షుడు
1. పురస్కార వివరాలు, నియమ నిబంధనలు
https://te.wikipedia.org/wiki/WP:KLRWP
2. ప్రతిపాదనల పేజీ
https://te.wikipedia.org/wiki/Wikipedia:Komarraju_LakshmanaRao_Wikimedia_Aw…
3. పురస్కార విజేతల వివరాలు
https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Winners
4. ప్రతిపాదన అంగీకరించిన సభ్యుల కృషి గణాంకాలు మరియు అభివృద్ధికి దోహదపడిన
అంశాల విశ్లేషణ
https://te.wikipedia.org/wiki/File:KLRWP-2013_Applicants_work_Statistics_an…
5.మూల్యాంకనం
https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Scoring
6. ఎంపిక మండలి ప్రశంసాపత్ర విజేతల వివరాలు
https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Jury_Appreciation_Winners
7. తెవికీ దశాబ్ది ఉత్సవ కార్యనిర్వాహక వర్గం
https://te.wikipedia.org/wiki/WP:TEWIKI10/Committee
--
--
"తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది.
ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, teluguwiki(a)googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, teluguwiki-unsubscribe(a)googlegroups.com కు
మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును
http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి
---
You received this message because you are subscribed to the Google Groups
"తెలుగువికీ" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an
email to teluguwiki+unsubscribe(a)googlegroups.com.
For more options, visit
https://groups.google.com/groups/opt_out.
_______________________________________________
WikiTe-L mailing list
WikiTe-L(a)lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l